Type of Network tools (తెలుగులో)
Networking మనకి ఉపయోగపడే చాలా రకాల tools అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో మనం ఎక్కువ గా ఉపయోగించే వాటిని మరియు ఎలా ఉపయోగించాలి చూద్దాం.
Network లో ఎక్కువ గా ethernet లో ఉపయోగించే డి utp cables మరియు RJ45 connecter. దీనికోసం వాడే కొన్ని tools చూద్దాం.
- Crimping Tool
- Network Cable tester
- Punch tool
- Stripper cutter
- Rj45 connectors
Crimping Tool
ఈ crimping tool ని RJ45 connector ని crimp చేయటానికి ఎక్కువ గా వాడతారు.దీనిలో utp cable ని cut చేసే విదంగా క్రింద అంటే crimping టూల్ చివరన ఒక అమరిక ఉంటుంది. దాని సహాయం తో మనం utp cable లోపల wire లను కత్తిరించవచ్చు. అయితే ముందుగా utp cable పయిన sleeve ను తొలగించి మీకు కావలసిన విధంగా లొపల wire లను 568A లేదా 568B ఇలా మీకు కావాల్సిన విధంగా colour code ను అమర్చి ఆ wires లను RJ45 connector లోపలకి పెట్టండి.తరువాత మీరు అమర్చిన కనెక్ట్రర్ ను RJ45 crimping tool లొపల పైన బాగంలో పెట్టి crimping Tool తో గట్టిగా press చేయండి. ఈ విధంగా చేయడం వలన ఆ connector అనేది crimp అవుతుంది .
Network cable Tester
ఈ network cable tester ను మనం crimp చేసిన cable అంటే RJ45 connector తో crimp చేసిన cables అనేవి అలాగే Rj45 cable అనేది సరిగ్గా పని చేస్తుందో లేదో Test చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఎలా test cheyalo ఇప్పడు చూద్దాం.
ఈ Tester లో రెండు రకాల cables ను check చేయడానికి rendu port లు ఉంటాయి.ఒకటి RJ45 మరియు ఇంకొకటి RJ11 మరియు దీనిలో 1 నుంచి 8 వరకు led అనేవి ఉంటాయి. ఇప్పడు మనం ఒక RJ45 connector ను పైన port లోను మరొక దానిని క్రింద ఉన్న Port లోను connect చేయాలి.
ఇప్పుడు ఈ network tester ను పైన switch సహాయం తో ఒన్ చేయండి. ఇప్పుడు పై నుంచి led లు అనేవి క్రింద వరకు వెలుగుతూ వెళ్తాయి.ఎక్కడయితే led అనేవి వెలగవో అక్కడ connection miss అయిందని తెలుసుకొని RJ45 re crimping చేయాలి.ఒకవేళ అన్ని led లు glow అయినట్లు తే ఆ RJ45 Cable అనేది బాగానే పనిచేస్తుంది అని మనం నిర్దారించవచ్చు.
Punch tool
ఈ punch tool ను ఒకవేళ మనం ఏదైనా ఒక గోడ కి RJ45 port ను ఉంచాలి అనుకుంటే దీని సహాయం తో port లోనికి ఇ Punch tool సహాయం తో లోపలకి wire లను punch చేయవచ్చు. ఇ punch tool లో ఒక వైపు wire ను punch చేయటానికి మరియు ఇంకొక వైపు wire ను కత్తిరించటానికి ఉంటుంది.
Stripper Cutter
ఇ stripper cutter సహాయం తో మనం utp cable ను యొక్క sleeve ను కత్తిరించడానికి ఉపయోగించవచ్చు.దీని చుట్టు ఒక రింగ్ అనేది ఉంటుంది. దీనిలోపల ఆ utp cable ని ఉంచి ఒక ring తిప్పినట్లయితే sleeve అనేది సులభంగా కత్తిరించబడుతుంది. ఈ విధముగా stripper cutter వాడవచ్చు.
RJ45 connectors
వీటిని మనము UtP cable కి ఇరు వైపులా crimp చేయటానికి ఉపయోగిస్తాము.ఏవి ప్లాస్టిక్ తో తయారు చేయబడు లోపల 8 పిన్నులు ఉంటాయి .వీటిని Utp చివర ఉంచి crimping tool తో crimp చేస్తారు.
పైన మనం networking లో ఉపయోగించే tool కోసం తెలుసుకున్నాం.ఇంకా networking లో ఉపయోగించే tools చాలానే ఉన్నాయి. వాటికోసం త్వరలోనే తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న క్రింది న comment చేయండి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి